Fri Mar 27 2026 10:44:13 GMT+0530 (India Standard Time)
వైసీపీలోకి మళ్లీ వలసలు.... టీడీపీకి షాక్!!!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నారాంబాబు పార్టీలో చేరనున్నారు. ఆయన జిల్లా వైసీపీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసులు రెడ్డిని కలిసి తన మనసులో మాట తెలిపారు. ఈ నెల 26, 27వ తేదీల్లో అన్నా రాంబాబు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువాను కప్పుకోనున్నారు. అన్నా రాంబాబు టీడీపీలో ఉండేవారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ గుర్తు మీద గెలిచిన అశోక్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో అన్నా రాంబాబు టీడీపీకి రాజీనామా చేశారు. గిద్దలూరు నియోజకవర్గంలో పార్టీ గెలుపునకు కృషి చేస్తానని అన్నా రాంబాబు తెలిపారు.
- Tags
- anna rambabu
- ashokreddy
- balineni srinivasulureddy
- giddaluru constiuency
- prakasam district
- telugudesamparty
- y.s jaganmohanreddy
- ysr congressparty
- అన్నా రాంబాబు
- గిద్దలూరు నియోజకవర్గం
- తెలుగుదేశం పార్టీ
- ప్రకాశం జిల్లా
- బాలినేని శ్రీనివాసులురెడ్డి
- ముత్తముల అశోక్ రెడ్డి
- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస పార్టీ
Next Story

