Sun Mar 22 2026 16:53:29 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వైసీపీ నేతల హౌస్ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా అనంతపురం జిల్లాలో పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేశారు. రాయదుర్గం వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే జిల్లాలోని కల్యాణ దుర్గంలోని పలువురు వైసీపీ నేతలను కూడా అరెస్ట్ చేశారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టవద్దని యూనివర్సిటీ విద్యార్థులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎన్నికల్లో హామీలను చంద్రబాబు అమలు చేయలేదని, అది ప్రశ్నిస్తామనే ముందస్తు అరెస్టులు చేస్తున్నారని కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు.
Next Story

