Mon Mar 23 2026 20:15:36 GMT+0530 (India Standard Time)
వైసీపీ కీలక నేతల సమావేశం

వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం నేపథ్యంలో సీనియర్ నేతలు కొద్దిసేపటి క్రితం పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న నేతలందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. జగన్ పై జరిగిన హత్యాయత్నం, ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వారు చర్చించనున్నారు. అలాగే జగన్ పాదయాత్ర కొనసాగించడంపై కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. కత్తి భుజంలో బలంగా దిగడంతో జగన్ కు తొమ్మిది కుట్లు పడ్డాయి. వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. జగన్ తో మాట్లాడిన తర్వాత పాదయాత్రపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. అలాగే జరిగిన సంఘటనపై గవర్నర్, రాష్ట్రపతిని ఎప్పుడు కలవాలన్నదానిపై కూడా నేతలు చర్చించనున్నారు.
Next Story

