బ్రేకింగ్ : వైసీపీ కూడా రేపు చలో ఆత్మకూరు
వైసీపీ కూడా చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపు నిచ్చింది. తెలుగుదేశం పార్టీ ఇదే కార్యక్రమానికి రేపు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ బాధితులను తమ గ్రామాలకు [more]
వైసీపీ కూడా చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపు నిచ్చింది. తెలుగుదేశం పార్టీ ఇదే కార్యక్రమానికి రేపు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ బాధితులను తమ గ్రామాలకు [more]

వైసీపీ కూడా చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపు నిచ్చింది. తెలుగుదేశం పార్టీ ఇదే కార్యక్రమానికి రేపు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ బాధితులను తమ గ్రామాలకు తీసుకెళ్లాలని చంద్రబాబు చలో ఆత్మకూరు కార్యక్రమం రేపు చేపట్టారు. అయితే దీనికి పోటీగా వైసీపీ రేపు ఇదే కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ నేత అంబటి రాంబాబు తెలిపారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడు ప్రాంతంలో చంద్రబాబు తన రాజకీయ లాభం కోసం చిచ్చు పెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. తాము కార్యక్రమానికి పోలీసుల అనుమతి కూడా తీసుకుంటున్నట్లు అంబటి రాంబాబు తెలిపారు. రెండు ప్రధాన పార్టీలూ రేపు చలో ఆత్మకూరు పిలుపు నివ్వడంతో పోలీసులు ఎవరికి అనుమతిచ్చే అవకాశం లేదు.