ఏ ఒక్క ఆధారమూ దొరకలేదా?
వైఎస్ వివేకానందరెడ్డి కేసు పైన సీబీఐ ఎటూ తెల్చు కోలేక పోతుందా? ఈ కేసులో అసలు దోషులెవరు.. అసలు ఏం జరిగింది.. అనే విషయాన్ని క్లారిటీ రాలేకపోతుందా? [more]
వైఎస్ వివేకానందరెడ్డి కేసు పైన సీబీఐ ఎటూ తెల్చు కోలేక పోతుందా? ఈ కేసులో అసలు దోషులెవరు.. అసలు ఏం జరిగింది.. అనే విషయాన్ని క్లారిటీ రాలేకపోతుందా? [more]

వైఎస్ వివేకానందరెడ్డి కేసు పైన సీబీఐ ఎటూ తెల్చు కోలేక పోతుందా? ఈ కేసులో అసలు దోషులెవరు.. అసలు ఏం జరిగింది.. అనే విషయాన్ని క్లారిటీ రాలేకపోతుందా? వైఎస్ వివేకానందరెడ్డి హత్య రెండు సంవత్సరాలు అవుతుంది. గత 70 రోజుల నుంచి సుదీర్ఘంగా కేసు పైన కడప సెంట్రల్ జైల్ లో మకాం వేసి సీబీఐ అనుమానితులను విచారిస్తుంది. ఇప్పుడు నిందితుల ఆచూకీ కోసం డైరెక్ట్ గా సీబీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య చేసిన వారి ఆచూకీ తెలిపితే 5 లక్షల రూపాయలు రివార్డ్ ఇస్తామని ప్రకటించింది. అంతేకాకుండా నిందితుల ఆచూకీ తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని వెల్లడించింది. వైఎస్ వివేకానందరెడ్డి ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని ,దీనికి సంబంధించిన నిందితుల ఆచూకీ లభ్యం కాలేదని, నిందితుల సంబంధించిన కచ్చితమైన సమాచారం ఇచ్చిన పక్షంలో 5 లక్షల రూపాయలు ఇస్తామని సీబీఐ ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో గత రెండున్నర నెలల సీబీఐ పరిశోధనలో హత్య కేసులో ఎలాంటి క్లూలు సీబీఐకి లభించలేదని అర్థమవుతుంది. అందుకే ఐదు లక్షల ప్రకటన చేయాల్సి వచ్చిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

