Sat Mar 21 2026 22:17:35 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : షర్మిల పార్టీని ప్రారంభించేది ఇక్కడి నుంచే..?
వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం ఖాయమయింది. యువజన, శ్రామిక, రైతు తెలంగాణ పార్టీగా పేరు ఖరారయింది. అయితే తొలుత తెలంగాణలోని పాత పది జిల్లాల నేతలతో షర్మిల [more]
వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం ఖాయమయింది. యువజన, శ్రామిక, రైతు తెలంగాణ పార్టీగా పేరు ఖరారయింది. అయితే తొలుత తెలంగాణలోని పాత పది జిల్లాల నేతలతో షర్మిల [more]

వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం ఖాయమయింది. యువజన, శ్రామిక, రైతు తెలంగాణ పార్టీగా పేరు ఖరారయింది. అయితే తొలుత తెలంగాణలోని పాత పది జిల్లాల నేతలతో షర్మిల సమావేశమై ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. మార్చి నెలలో ఇడుపుల పాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం చేవెళ్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఈ సభలోనే తెలంగాణలో కొత్త పార్టీని షర్మిల ప్రకటిస్తారు. అనంతరం షర్మిల పాదయాత్ర కూడా చేయనున్నారు. వైఎస్ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, తెలంగాణ ప్రజల కోసమే షర్మిల ఇక్కడ పార్టీ పెడుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.
Next Story