Mon Dec 22 2025 21:24:47 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ చర్చ ఎందుకు…? చోద్యం కాకపోతే?
పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై చర్చకు టీడీపీ పట్టుబట్టింది. అయితే ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ దీనిపై గతంలోనే [more]
పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై చర్చకు టీడీపీ పట్టుబట్టింది. అయితే ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ దీనిపై గతంలోనే [more]

పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై చర్చకు టీడీపీ పట్టుబట్టింది. అయితే ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ దీనిపై గతంలోనే చర్చించామని, శాసనమండలి నుంచి తిరిగి వచ్చిన తర్వాత దీనిని మళ్లీ సభలో ప్రవేశపెట్టామని జగన్ తెలిపారు. ఇంతకు ముందే కూలంకషంగా దీనిపై చర్చ జరిపినా మరోసారి చర్చకు పట్టుబట్టడమేంటని జగన్ టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎవరైనా డబ్బులు పంచినట్లు రుజువైతే వారిని అనర్హులుగా ప్రకటించేలా చట్టాన్ని తెచ్చామని జగన్ వివరించారు. అసెంబ్లీలో చర్చ జరిగిందని, శాసనమండలిలోనూ దీనిపై చర్చించి వెనక్కు పంపిన విషయాన్ని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Next Story