ఎల్లుండి వారికి జగన్ అదిరేటి విందు
బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. వచ్చే మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలకు విందు ఇవ్వనున్నారు. [more]
బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. వచ్చే మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలకు విందు ఇవ్వనున్నారు. [more]

బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. వచ్చే మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలకు విందు ఇవ్వనున్నారు. పదమూడు జిల్లాలకు విడివిడిగా 13 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. అక్కడ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు ఆ జిల్లా ఎమ్మెల్యేలు ఉంటారు. ఒక్కొక్క టేబుల్ దగ్గర జగన్ పది నిమిషాలు గడపనున్నారు. జిల్లా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, శాంతిభద్రతల సమస్య వంటివి నేరుగా జగన్ వారిని అడిగి తెలుసుకోనున్నారు. వారి నుంచి సూచనలను కూడా జగన్ తీసుకోనున్నారు. ఈ విందులో రుచికరమైన ఆంధ్ర వంటకాలతో పాటు నార్త్, సౌత్ ఇండియన్ డిషెస్ కూడా ఉండనున్నాయి.