Fri Mar 27 2026 07:41:45 GMT+0530 (India Standard Time)
నేడు విశాఖలో జగన్
ఈరోజు విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వైఎస్ జగన్ ముఖ్య అతిధిగా [more]
ఈరోజు విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వైఎస్ జగన్ ముఖ్య అతిధిగా [more]

ఈరోజు విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వైఎస్ జగన్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. సీఎం జగన్ మధ్యాహ్నం 2.50 గంటలకి గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖ బయలుదేరనున్నారు. 3.30 గంటలకి విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకి బీచ్ రోడ్ లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ చేరుకుంటారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనంతరం 5.30 గంటలకి విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి 6.10 గంటలకి జగన్ తాడేపల్లికి చేరుకోనున్నారు.
Next Story