Fri Dec 19 2025 20:20:41 GMT+0000 (Coordinated Universal Time)
ప్రధాని మోదీతో జగన్ భేటీ ఖరారు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీ తో భేటీ కాననున్నారు. ఈ నెల 6వ తేదీన ప్రధానితో ఆయన సమావేశం ఖరారయింది. రాష్ట్రానికి సంబంధించి వివిధ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీ తో భేటీ కాననున్నారు. ఈ నెల 6వ తేదీన ప్రధానితో ఆయన సమావేశం ఖరారయింది. రాష్ట్రానికి సంబంధించి వివిధ [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీ తో భేటీ కాననున్నారు. ఈ నెల 6వ తేదీన ప్రధానితో ఆయన సమావేశం ఖరారయింది. రాష్ట్రానికి సంబంధించి వివిధ సమస్యలపై వైఎస్ జగన్ మోదీతో చర్చించనున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై జగన్ మోదీ దృష్టికి తేనున్నారు. ఈనెల5 వ తేదీన జగన్ పులివెందుల వెళతారు. అక్కడ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ కార్యక్రమాల్లో పాల్గొని అటునుంచే ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ వెళ్లిన జగన్ ప్రధానితో సమావేశం తర్వాత అపెక్స్ కమిటీ సమావేశంలో కూడా పాల్గొనే అవకాశముంది.
Next Story