Fri Mar 27 2026 05:49:43 GMT+0530 (India Standard Time)
అన్నగా నేనున్నా… మాట తప్పను
వైఎస్సార్ ఆసరా పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. పొదుపు సంఘాలకు తొలి విడతగా 6,792 కోట్లను జమ చేయనున్నారు. మొత్తం 87.85 లక్షల మందికి [more]
వైఎస్సార్ ఆసరా పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. పొదుపు సంఘాలకు తొలి విడతగా 6,792 కోట్లను జమ చేయనున్నారు. మొత్తం 87.85 లక్షల మందికి [more]

వైఎస్సార్ ఆసరా పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. పొదుపు సంఘాలకు తొలి విడతగా 6,792 కోట్లను జమ చేయనున్నారు. మొత్తం 87.85 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని వైఎస్ జగన్ తెలిపారు. ఏపీ మహిళ చరిత్రను మార్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ డబ్బును పెట్టుబడిగా మార్చుకుని బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుని వ్యాపారాలను మరింతగా వృద్ధి చేసుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఒక అన్నగా మీకిచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నానని వైఎస్ జగన్ చెప్పారు. నాలుగు దఫాలుగా 27,268 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుందని వైఎస్ జగన్ తెలిపారు.
Next Story