పాదయాత్రలో వారిన చూసిన తర్వాతనే?
పాదయాత్రలో మహిళల కష్టాలను చూసే వైఎస్సార్ చేయూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న [more]
పాదయాత్రలో మహిళల కష్టాలను చూసే వైఎస్సార్ చేయూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న [more]

పాదయాత్రలో మహిళల కష్టాలను చూసే వైఎస్సార్ చేయూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న 45 సంవత్సరాలు దాటిన పేద మహిళలకు ఏడాదికి 18,750లు ఈ పధకం కింద ఇవ్వనున్నారు. నాలుగేళ్లలో 75 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు జగన్ ప్రకటించారు. ప్రభుత్వ సహకారంతో సొంత కాళ్ల మీద నిలబడే వారి కోసం చేయూత పథకాన్ని ఏర్పాటు చేశామన్నారు. అమూల్ వంటి సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకున్నామని చెప్పారు. ఈ పధకం కోసం ఈ ఏడాది 4,750 కోట్ల రూపాయలను కేటాయించినట్లు జగన్ తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పారు. పింఛను తీసుకుంటున్న మహిళలకు కూడా ఈ పథకం వర్తిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది మహిళల వరకూ ఈ పథకం కింద లబ్ది పొందే అవకాశముంది.