Mon Apr 06 2026 21:10:59 GMT+0530 (India Standard Time)
ఇక గ్రామాల్లోకి జగన్.. రచ్చ బండ తరహాలో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈరోజు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆగస్టు నెల నుంచి జిల్లాల్లోని [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈరోజు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆగస్టు నెల నుంచి జిల్లాల్లోని [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈరోజు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆగస్టు నెల నుంచి జిల్లాల్లోని గ్రామాలను పర్యటించనున్నట్లు జగన్ వెల్లడించారు. రచ్చ బండ కార్యక్రమం తరహాలో జగన్ గ్రామాల పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు నాటికి కరోనా కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటంతో పల్లెల్లో పర్యటించాలని జగన్ నిర్ణయించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి గ్రామాల పర్యటన చేపడుతుండటం విశేషం.
Next Story