జగనన్న చేదోడును ప్రారంభించిన సీఎం
ఆంధ్రప్రదేశ్ లో జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఏపీలో షాపులున్న నాయీ బ్రాహ్మణులు, లాండ్రీ షాపుల యజమానులకు, టైలర్స్ కు ఏడాదికి పదివేల రూపాయలు [more]
ఆంధ్రప్రదేశ్ లో జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఏపీలో షాపులున్న నాయీ బ్రాహ్మణులు, లాండ్రీ షాపుల యజమానులకు, టైలర్స్ కు ఏడాదికి పదివేల రూపాయలు [more]

ఆంధ్రప్రదేశ్ లో జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఏపీలో షాపులున్న నాయీ బ్రాహ్మణులు, లాండ్రీ షాపుల యజమానులకు, టైలర్స్ కు ఏడాదికి పదివేల రూపాయలు ఇవ్వనున్నారు. ఈరోజు వారి ఖాతాల్లో నగదును జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తాను మ్యానిఫేస్టోలో చెప్పినట్లుగానే అందరికీ జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. బడుగు, బలహీన వర్గా వారికి అండగా నిలిచేందుకే ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. మొత్తం 2,47 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు. ఇందుకోసం 247 కోట్ల రూపాయలను కేటాయించారు.