నాకు ఇవ్వడమే తప్ప కత్తిరించడం తెలీదు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వైఎస్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ విడత ప్రతి రైతు ఖాతాలో [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వైఎస్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ విడత ప్రతి రైతు ఖాతాలో [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వైఎస్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ విడత ప్రతి రైతు ఖాతాలో 5,500లు విడుదల చేస్తున్నట్లు జగన్ తెలిపారు. రైతలకు ఎంత చేసినా తక్కువేనని జగన్ అన్నారు. ఈ పెట్టుబడిసాయం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాజకీయాలు, పార్టీలకు, కులాలు, మతాలకు అతీతంగా ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నామన్నారు. 1.5 ఎకరాలున్న రైతులు దాదాపు యాభై శాతం మంది ఉన్నారన్నారు. పంట పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయకూడదనే ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. వరసగా రెండో ఏడాది కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. తనకు ఎలా ఇవ్వాలన్న ఆరాటం తప్ప ఎలా కత్తిరించాలన్న ఉద్దేశం లేదన్నారు. తొలివిడతగా ఈరోజు 2,800 కోట్లు విడుదల చేశామన్నారు జగన్. అందని రైైతులు నెల రోజుల్లోగా గ్రామ సచివాలయంలో నమోదు చేసుకోవచ్చని జగన్ తెలిపారు. పాలన చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మే 30 తేదీన 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

