Sun Feb 01 2026 12:12:06 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ ఘటపై జగన్ సమీక్ష.. అందరి ఖాతాల్లో?
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. ప్రతి ఒక్కరి ఖాతాలో పది వేల రూపాయలు మూడు రోజుల్లోగా జమ చేయాలని జగన్ [more]
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. ప్రతి ఒక్కరి ఖాతాలో పది వేల రూపాయలు మూడు రోజుల్లోగా జమ చేయాలని జగన్ [more]

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. ప్రతి ఒక్కరి ఖాతాలో పది వేల రూపాయలు మూడు రోజుల్లోగా జమ చేయాలని జగన్ ఆదేశించారు. మహిళల ఖాతాల్లోనే నగదు జమ చేయాలన్నారు. చిన్న పిల్లలతో సహా అందరికీ ఒక్కొక్కరికి పదివేలు పరిహారం అందించాలని జగన్ అధికారులను కోరారు. పరిసర ప్రాంతాల ప్రజల్లో ధైర్యం నింపేందుకు మంత్రులు ఆ యా గ్రామాల్లో నిద్రించాలని జగన్ ఆదేశించారు. ఆ ఐదు గ్రామాల్లో సాధారణ పరిస్థితిని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అలాగే చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరూ కోలుకునేలా చూడాలని అధికారులను కోరారు.
Next Story