కేంద్రం అండ ఉందన్న జగన్
కేంద్రంతో తమకు సత్సంబంధాలున్నాయని, పొరుగు రాష్ట్రాలతో కూడా మంచి సంబంధాలున్నాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. విజయవాడలో జరిగిన డిప్లొమాటిక్ ఔట్ రీచ్ సదస్సులో జగన్ [more]
కేంద్రంతో తమకు సత్సంబంధాలున్నాయని, పొరుగు రాష్ట్రాలతో కూడా మంచి సంబంధాలున్నాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. విజయవాడలో జరిగిన డిప్లొమాటిక్ ఔట్ రీచ్ సదస్సులో జగన్ [more]

కేంద్రంతో తమకు సత్సంబంధాలున్నాయని, పొరుగు రాష్ట్రాలతో కూడా మంచి సంబంధాలున్నాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. విజయవాడలో జరిగిన డిప్లొమాటిక్ ఔట్ రీచ్ సదస్సులో జగన్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని కోరారు. ఇందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను తమ ప్రభుత్వం కల్పించడానికి సిద్ధంగా ఉందని జగన్ చెప్పారు. తాము అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పారు. అధికారంలోకి తాము వచ్చిన రెండునెలల్లోనే విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. పెట్టుబడులకు రాష్ట్రంలో అనేక అవకాశాలున్నాయన్న జగన్, మంచి నగరం లేకపోవడం ఇబ్బందికరమేనని అంగీకరించారు. కేంద్ర ప్రభుత్వం కూడా తన ప్రభుత్వానికి అండగా ఉందని జగన్ చెప్పారు.