రంజాన్ వేళ జగన్ మినహాయింపులు
రంజాన్ మాసం ప్రారంభం కావడంతో జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. మసీదుల్లో ప్రార్ధనలు జరపరాదని ఇప్పటికే ఆదేశించిన జగన్ ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇస్తూ ఉత్తర్వులు [more]
రంజాన్ మాసం ప్రారంభం కావడంతో జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. మసీదుల్లో ప్రార్ధనలు జరపరాదని ఇప్పటికే ఆదేశించిన జగన్ ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇస్తూ ఉత్తర్వులు [more]

రంజాన్ మాసం ప్రారంభం కావడంతో జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. మసీదుల్లో ప్రార్ధనలు జరపరాదని ఇప్పటికే ఆదేశించిన జగన్ ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్ మాసంలో మసీదులో ఐదు మందికి మించకుండా ప్రార్థనలు చేసుకునే వీలు కల్పించింది. ఇమాం, మౌజామ్ కాకుండా మరో ముగ్గురికి మాత్రమే ప్రార్థనలకు అనుమతి ఉంటుంది. రంజాన్ మాసం సందర్భంగా ఉదయం పదిగంటల వరకూ నిత్యావసర వస్తువులు, పండ్ల దుకాణాలకు అనుమతి ఇచ్చింది. సాయంత్రం పూట డ్రైఫ్రూట్స్ దుకాణాలకు కూడా అనుమతి ఇచ్చింది. ఇఫ్తార్ సమయంలో టేక్ అవే లకూ మినహాయింపులు ఇచ్చింది. ప్రార్థనల సమయంలోనూ, డ్రైఫ్రూట్స్ దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలని మాత్రం జగన్ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.