జగన్ ఫీడ్ బ్యాక్ తీసుకోవడం లేదా?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫీడ్ బ్యాక్ తీసుకోవడం లేదని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి తెలుస్తుందటున్నారు. ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు దాని గురించి [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫీడ్ బ్యాక్ తీసుకోవడం లేదని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి తెలుస్తుందటున్నారు. ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు దాని గురించి [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫీడ్ బ్యాక్ తీసుకోవడం లేదని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి తెలుస్తుందటున్నారు. ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు దాని గురించి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ముందుగా దానిని ప్రజల్లోకి ఫిల్లర్స్ వదులుతారు. చర్చ జరిగిన తర్వాతనే దాని పాజిటివ్, నెగిటివ్ టాక్ ను బట్టి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రం నిర్ణయం ముందుగా ప్రకటించి తర్వాత వెనక్కు తగ్గుతున్నారు.
నిర్ణయంలో సడలింపులు….
తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధించాలని నిర్ణయించారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియంలోనే బోధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు సయితం శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే దీనిపై వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గాల్సి వచ్చింది. తాజాగా జగన్ తన నిర్ణయాన్ని తానే వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. ఎనిమిదో తరగతి వరకూ కాకుండా ఆరో తరగతి వరకు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో బోధించాలని తాజాగా జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణం జగన్ కు ఫీడ్ బ్యాక్ సరిగా లేకపోవడమే అంటున్నారు. తెలుగు భాషను కనుమరుగు చేసేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారంటూ కొందరు విమర్శలు సయితం చేశారు.

