త్వరలోనే జగన్ ప్రకటన..వారికి ఊరట
ఏపీలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రులు సయితం జగన్ [more]
ఏపీలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రులు సయితం జగన్ [more]

ఏపీలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రులు సయితం జగన్ పనితీరును ప్రశంసిస్తున్నారని తెలిపారు. కరోనా టెస్టింగ్ కిట్స్ ను ఇప్పటికే యాభైవేలు తయారు చేశామని, మరో యాభై వేల కిట్లను తయారు చేయాలని జగన్ ఆదేశించారన్నారు. లక్ష కిట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రోజుల్లో ఇరవై లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఇండియన్ టెక్నాలజీతో వెంటిలేటర్లను కూడా తయారు చేస్తున్నామని చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో మధ్య తరహా పరిశ్రమలకు త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ ప్యాకేజీ ప్రకటిస్తారని మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు. త్వరలోనే దీనిపై ప్రకటన చేయనున్నారని చెప్పారు.