జగన్ ఒకలా.. కేసీఆర్ మరోలా
హాట్ స్పాట్ ప్రాంతాలలను మినహాయించి మిగిలిన ఏరియాల్లో లాక్ డౌన్ ను ఎత్తివేయడం మంచిదని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిందన్నారు. లాక్ [more]
హాట్ స్పాట్ ప్రాంతాలలను మినహాయించి మిగిలిన ఏరియాల్లో లాక్ డౌన్ ను ఎత్తివేయడం మంచిదని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిందన్నారు. లాక్ [more]
హాట్ స్పాట్ ప్రాంతాలలను మినహాయించి మిగిలిన ఏరియాల్లో లాక్ డౌన్ ను ఎత్తివేయడం మంచిదని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిందన్నారు. లాక్ డౌన్ ను పొడిగించి ప్రయివేటు ప్రయివేటు ఉద్యోగులకు జీతాలివ్వాలని మనం ఎలా ఆదేశించగలమని జగన్ ప్రశ్నించారు. ఆదాయం లేకపోవడంతో ఉద్యోగుల జీతాలు చెల్లించడం కూడా కష్ట సాధ్యంగా మారిందన్నారు. మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ ఈ అభిప్రాయాలను వెల్లడించారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు పొడిగించాలని చెప్పారు. లాక్ డౌన్ ఒక్కసారి ఎత్తివేస్తే కంట్రోల్ చేయడం కష్టమవుతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.