Fri Mar 20 2026 13:50:44 GMT+0530 (India Standard Time)
జగన్ తో డీజీపీ భేటీ.. నిమ్మగడ్డ లేఖపై?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో డీజీపీ గౌతం సవాంగ్ భేటీ అయ్యారు. ఆయనతో పాటు ఇంటలిజెన్స్ చీఫ్ మనీష్ కుమార్ కూడా హాజరయ్యారు. నిన్న రాష్ట్ర ఎన్నికల [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో డీజీపీ గౌతం సవాంగ్ భేటీ అయ్యారు. ఆయనతో పాటు ఇంటలిజెన్స్ చీఫ్ మనీష్ కుమార్ కూడా హాజరయ్యారు. నిన్న రాష్ట్ర ఎన్నికల [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో డీజీపీ గౌతం సవాంగ్ భేటీ అయ్యారు. ఆయనతో పాటు ఇంటలిజెన్స్ చీఫ్ మనీష్ కుమార్ కూడా హాజరయ్యారు. నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలు కావాలని, తనకు కూడా భద్రత కల్పించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసినట్లు ఒక లేఖ బయటకు వచ్చింది. అయితే ఈ లేఖపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇంతవరకూ స్పందించలేదు. ఇది నిమ్మగడ్డ రమేష కుమార్ రాసిందా? లేక ఫేక్ లెటరా? అనేది జగన్ అధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఏపీలోని తాజా పరిస్థితులను కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్నారు.
Next Story