Wed Mar 25 2026 06:18:32 GMT+0530 (India Standard Time)
నవీన్ పట్నాయక్ సమయం కోరిన జగన్
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో మాట్లాడేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమయం కోరారు. ఈ మేరకు ఆయనకు జగన్ లేఖ రాశారు. ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో [more]
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో మాట్లాడేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమయం కోరారు. ఈ మేరకు ఆయనకు జగన్ లేఖ రాశారు. ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో [more]

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో మాట్లాడేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమయం కోరారు. ఈ మేరకు ఆయనకు జగన్ లేఖ రాశారు. ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో వంశధార నది మీద నేరడి బ్యారేజీ నిర్మాణంపై చర్చలు జరిపేందుకు నవీన్ పట్నాయక్ తో సమావేశమవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారు. త్వరలోనే ఆయనను కలసి జగన్ నేరడి బ్యారేజీ నిర్మాణంపై చర్చలు జరపనున్నారు. సముద్రంలోకి పోతున్న 80 టీఎంసీల నీటిని ఈ బ్యారేజీ నిర్మాణం ద్వారా సద్వినియోగం చేసుకోవచ్చని జగన్ చెబుతున్నారు. రెండు రాష్ట్రాల రైతులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని, త్వరలోనే జగన్ నవీన్ పట్నాయక్ ను కలుస్తారని తెలుస్తోంది.
Next Story