Sat Mar 21 2026 20:20:26 GMT+0530 (India Standard Time)
రేపు ఢిల్లీకి జగన్… కేంద్రం పెద్దలతో?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి. ఆయన ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుస్తారని తెలిసింది. అమిత్ షా [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి. ఆయన ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుస్తారని తెలిసింది. అమిత్ షా [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి. ఆయన ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుస్తారని తెలిసింది. అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం సీఎంవో ఇప్పటికే కోరినట్లు సమాచారం. అమిత్ షా అపాయింట్ మెంట్ దొరికితే జగన్ రేపు ఢిల్లీ వెళతారు. ప్రధానంగా రాష్ట్ర సమస్యలతో పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశాన్ని కూడా చర్చించే అవకాశముందని తెలిసింది. అయితే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై ఇంకా అధికార ప్రకటన వెలువడలేదు.
Next Story