Tue Mar 24 2026 14:39:41 GMT+0530 (India Standard Time)
ఎవరి ప్రలోభాలకు లొంగద్దు… లేఖలో కోరిన జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాలంటీర్లకు లేఖ రాశారు. వాలంటీర్లు జీతాలు పెంచమని కోరుతూ ఆందోళన చేయడంపై జగన్ స్పందించారు. వాస్తవాలు తెలియకుండా కొందరు రోడ్డెక్కిన విషయం [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాలంటీర్లకు లేఖ రాశారు. వాలంటీర్లు జీతాలు పెంచమని కోరుతూ ఆందోళన చేయడంపై జగన్ స్పందించారు. వాస్తవాలు తెలియకుండా కొందరు రోడ్డెక్కిన విషయం [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాలంటీర్లకు లేఖ రాశారు. వాలంటీర్లు జీతాలు పెంచమని కోరుతూ ఆందోళన చేయడంపై జగన్ స్పందించారు. వాస్తవాలు తెలియకుండా కొందరు రోడ్డెక్కిన విషయం తనను బాధించిందని జగన్ లేఖలో పేర్కొన్నారు. రెండున్నర లక్షల మంది వాలంటీర్లు రాష్ట్రంలో సేవాభావంతో పనిచేస్తున్నారని, ఈ విధానానికి అన్ని రాష్ట్రాలూ ప్రశంసిస్తున్నాయన్నారు. వారి రాష్ట్రాల్లోనూ ఇలాంటి వ్యవస్థపెట్టాలని యోచిస్తున్నాయన్నారు. వాలంటీర్ అనేది ఉద్యోగం కాదని, సేవ అనే విషయం స్పష్టంగా తెలిపామని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ఎవరి ప్రలోభాలకు లొంగవద్దని జగన్ తన లేఖలో వాలంటీర్లను కోరారు.
Next Story