బ్రేకింగ్ : నిమ్మగడ్డపై జగన్ ఘాటు విమర్శలు… కోవర్టు అంటూ?
ప్రతిపక్షాల కడుపు మంట ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసునని జగన్ అన్నారు. విగ్రహాల ధ్వంసం ఎవరు చేస్తున్నారో అర్థం చేసుకోమన్నారు. రథాలను ఎవరు తగలుబెడుతున్నారు? తర్వాత [more]
ప్రతిపక్షాల కడుపు మంట ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసునని జగన్ అన్నారు. విగ్రహాల ధ్వంసం ఎవరు చేస్తున్నారో అర్థం చేసుకోమన్నారు. రథాలను ఎవరు తగలుబెడుతున్నారు? తర్వాత [more]

ప్రతిపక్షాల కడుపు మంట ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసునని జగన్ అన్నారు. విగ్రహాల ధ్వంసం ఎవరు చేస్తున్నారో అర్థం చేసుకోమన్నారు. రథాలను ఎవరు తగలుబెడుతున్నారు? తర్వాత రథయాత్రలు ఎవరు చేయబోతున్నారో? ఒకసారి ఆలోచించుకోవాలని జగన్ పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన రోజునే ఈ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. దేవుడు మీద భక్తిలేని వాళ్లు, ఆలయ భూములను కాజేసిన వారు, దుర్గగుడిలో క్షుద్రపూజలు చేసిన వారు, ఆలయాలను కూల్చివేసిన వాళ్లు కొత్త వేషం కడుతున్నారని జగన్ అన్నారు. కరోనా కు భయపడి చంద్రబాబు, లోకేష్ లు హైదరాబాద్ లో ఉంటారని, ప్రజలను మాత్రం కరోనా గురించి పట్టించుకోకుండా చంద్రబాబు కోవర్టులు ఎన్నికల షెడ్యూల్ ఎలా విడుదల చేస్తున్నారో అందరికీ తెలుసునన్నారు. సంక్షేమ పథకాలను నిలిపేయాలంటూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారని జగన్ ఆరోపించారు. గుడుల అయిపోయాయి.. ఇక బడులు మీద పడతారేమో జాగ్రత్తగా ఉండాలని జగన్ సూచించారు.
విద్యార్థులకు జగనన్న వరాలు.. ఇక ల్యాప్ ట్యాప్ లు….
ప్రభుత్వ పాఠశాలలను ప్రయివేటు పాఠశాలల కంటే ధీటుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఇకపై బడికి ఒక రోజు రాకపోతే తల్లిదండ్రులకు మెసేజ్ వస్తుందన్నారు. రెండు రోజుల పాటు వరసగా బడికి రాకపోతే నేరుగా వాలంటీర్ వారి ఇంటికి వెళ్లి పిల్లల యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంటారన్నారు. ఇలా హాజరు శాతం పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గత 19 నెలల్లో పిల్లల చదువుకోసం అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవన, నాడు-నేడు, సంపూర్ణ పోషణ, విద్యాకానుక, గోరుముద్ద వంటి పథకాల కింద 24 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. వచ్చే ఏడాది అమ్మఒడి పథకం కింద డబ్బులు వద్దనుకుంటే ల్యాప్ ట్యాప్ ఇస్తామని జగన్ ప్రకటించారు. అది తల్లిదండ్రుల ఇష్టానికే వదిలేస్తామని చెప్పారు. 9 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు ఈ సదుపాయం ఉంటుందన్నారు. ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. రాబోయే మూడేళ్లలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ ప్రపంచంలో తట్టుకునే విధంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

