Sat Mar 28 2026 06:34:09 GMT+0530 (India Standard Time)
ఆ కుటుంబానికి జగన్ ఆర్థిక సాయం
అనంతపురంలో మృతి చెందిన స్నేహలత కుటుంబానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. చట్ట పరంగా వచ్చే పరిహారంతో పాటు అదనంగా పది లక్షల [more]
అనంతపురంలో మృతి చెందిన స్నేహలత కుటుంబానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. చట్ట పరంగా వచ్చే పరిహారంతో పాటు అదనంగా పది లక్షల [more]

అనంతపురంలో మృతి చెందిన స్నేహలత కుటుంబానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. చట్ట పరంగా వచ్చే పరిహారంతో పాటు అదనంగా పది లక్షల ఆర్థిక సాయం అందజేయాలని జగన్ ఆదేశించారు. త్వరితగతిన కేసును దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని జగన్ అధికారులను ఆదేశించారు. స్నేహలత కుటుంబానికి ఇల్లు, ఇంటిస్థలాన్ని కూడా అందజేస్తామని జగన్ తెలిపారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగంతో పాటు ఐదు ఎకరాల పొలాన్ని కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు జగన్ అనంతపురం జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
Next Story