Thu Dec 18 2025 17:49:11 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ఢిల్లీ ఆకస్మిక పర్యటనతో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. జగన్ ఈరోజు రాత్రి 9 గంటలకు అమిత్ షాను కలవనున్నారు. ఆయనతో వివిధ అంశాలపై చర్చించనున్నారు. మరికాసేపట్లో [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. జగన్ ఈరోజు రాత్రి 9 గంటలకు అమిత్ షాను కలవనున్నారు. ఆయనతో వివిధ అంశాలపై చర్చించనున్నారు. మరికాసేపట్లో [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. జగన్ ఈరోజు రాత్రి 9 గంటలకు అమిత్ షాను కలవనున్నారు. ఆయనతో వివిధ అంశాలపై చర్చించనున్నారు. మరికాసేపట్లో ఢిల్లీకి చేరనున్న జగన్ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశముందని చెబుతున్నారు. జగన్ ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనపై అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రైతు బంద్ కు సంపూర్ణ మద్దతిచ్చిన తర్వాత జగన్ తొలిసారి బీజేపీ పెద్దలను కలుస్తున్నారు. అయితే రాష్ట్ర అంశాలపై కంటే రాజకీయ పరమైన అంశాల కోసమే జగన్ ఢిల్లీ పర్యటన ఉండనుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Next Story