Fri Mar 27 2026 19:18:46 GMT+0530 (India Standard Time)
మాజీ ఎమ్మెల్యేకు జగన్ కండువా కప్పేశారు....!!!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అన్నారాంబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఆయనకు పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. అన్నారాంబాబు గతంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ వైసీపీ గుర్తు మీద గెలిచిన ముత్తముల అశోక్ రెడ్డి టీడీపీలో చేరడంతో అన్నారాంబాబు వైసీపీలో చేరారు. శ్రీకాకుళం జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ సమక్షంలో కొద్దిసేపటి క్రితం అన్నారాంబాబు పార్టీలో చేరారు. ఆయనను పార్టీ జిల్లా అధ్కక్షుడు బాలినేని శ్రీనివాసులురెడ్డి జగన్ వద్దకు తీసుకు వచ్చారు.
Next Story

