Mon Mar 23 2026 14:47:15 GMT+0530 (India Standard Time)
నడక ఆపిన జగన్ ...?

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రకు విరామమిచ్చి హైదరాబాద్ బయలుదేరారు.రేపు శుక్రవారం కావడంతో జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ప్రతి శుక్రవారం జగన్ సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు. జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ మధ్యాహ్నం యాత్రకు విరామమిచ్చి హుటాహుటిన హైదరాబాద్ కు బయలేదేరారు. రేపు పాదయాత్ర ఉండదు. తిరిగి శనివారం జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో ప్రారంభమవుతుంది. త్వరగా హైదరాబాద్ వచ్చి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో జగన్ సమావేశం కానున్నారు. రేపు ఆయన సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు.
Next Story

