బ్రేకింగ్ : జగన్ ప్రకటనతో పార్టీకి సీనియర్ నేత రాజీనామా

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని జగన్ చేసిన ప్రకటన అటు తెలుగుదేశంలోనే కాదు ఇటు వైసీపీలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జగన్ ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ పార్టీ రాజకీయ సలహాదారు దుట్టా రామచంద్రరావు. దుట్టా రామచంద్రరావు గత ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కృష్ణమ్మ తల్లి ఎందరికో అన్నం పెడుతుందని, అలాంటి కృష్ణమ్మ పేరును మారుస్తానంటే ఊరుకోనని హెచ్చరించారు. జగన్ తన ప్రకటనను ఉపసంహరించుకోకుంటే పార్టీకి రాజీనామా చేస్తానన్నారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, జగన్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జిల్లా పేరును మార్చడానికి వీల్లేదన్నారు. తాను ఈరోజే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు దుట్టా ప్రకటించారు. ఎన్టీఆర్ కు తాను వ్యతిరేకిని కానని, కృష్ణానది పేరు మీద ఉన్న ఈ జిల్లా పేరు మార్చడాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు.
