Wed Mar 25 2026 01:44:19 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వైఎస్ జగన్ కీలక నిర్ణయం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడూ లేనివిధంగా మొదటిసారి రాజమండ్రి పార్లమెంటు స్థానానికి బీసీ అభ్యర్థిని ప్రకటించారు. జగన్ సమక్షంలో ఇవాళ రాజమండ్రికి చెందిన గీత కులాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు, ఆయన కుమారుడు మార్గాని భరత్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... నాలుగేన్నర దశాబ్దాల చరిత్రలో ఎప్పుడూలేని విధంగా రాజమండ్రి పార్లమెంటు స్థానాన్ని బీసీకి కేటాయిస్తున్నామని, యువకుడైన మార్గాని భరత్ ను అభ్యర్థిగా ప్రకటించారు. బలహీన వర్గాలకు ఎళ్లప్పుడూ తమ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. జగన్ సమక్షంలో శెట్టిబలిజ, గౌడ, ఈడిగ సామాజికవర్గాలకు చెందిన పలువురు నేతలు వైసీపీలో పాల్గొన్నారు.
Next Story

