Fri Jan 30 2026 18:24:06 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు డొక్కు వాహనమా..?

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు ప్రభుత్వం కేటాయించిన వాహనం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ కు కేటాయించిన ఏపీ 9 పీఏ 454 స్కార్పియో వాహనం ప్రయాణంలో తరచూ మొరాయిస్తోంది. దీంతో ఆయన ఇప్పటికే మూడుసార్లు పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ప్రస్థుతం తనకు కేటాయించిన వాహనం ఇంతకుముందు శ్రీకాకుళంలో అధికారులు వాడారని, ఆ వాహనం పూర్తిగా పాతబడిపోయిందని ఆయన వివరించారు. ఈ వాహనం మార్చి, భద్రత కరణాల దృష్యా ఏదైనా కొత్త వాహనం కేటాయించాలని లేఖల్లో కోరారు. అయితే, జగన్ విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం, పోలీసు శాఖ స్పందించకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన ప్రస్తుతం తన సొంత వాహనాన్నే ఉపయోగించుకుంటున్నారు.
Next Story

