Thu Mar 19 2026 10:39:09 GMT+0530 (India Standard Time)
వారికి జగన్ హామీ ఇదే..!

దేవుడి దయ, ప్రజల దీవెనలతో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని ఆ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లా కోటవురట్లలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ... రైతులకు మేలు చేయడమే వైఎస్సార్సీపీ ప్రధాన లక్ష్యమన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వ్యవసాయానికి పగటిపూటే తొమ్మిది గంటల ఉచిత కరెంటు ఇస్తామని పేర్కొన్నారు. రైతులకు వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తామని, రైతులకు పెట్టుబడుల కోసం ప్రతి సంవత్సరం మే నెలలో సంవత్సరానికి రూ.12,500 ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయించి వారు బోర్లతో అప్పులపాలు కాకుండా చూస్తామన్నారు.
Next Story

