Thu Jan 29 2026 17:45:54 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీకాంత్ రెడ్డి పై జగన్ సీరియస్
చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానంపై ఓటింగ్ జరిగే సమయంలో దాదాపు 17 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు [more]
చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానంపై ఓటింగ్ జరిగే సమయంలో దాదాపు 17 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు [more]

చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానంపై ఓటింగ్ జరిగే సమయంలో దాదాపు 17 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంపై జగన్ అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవడంలో శ్రీకాంత్ రెడ్డి విఫలమయ్యారని జగన్ అభిప్రాయపడ్డారు. చివరకు అప్పటి వరకూ సభలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దాడిశెట్టి రాజాలు కూడా ఓటింగ్ సమయానికి లేకపోవడం సమన్వయ లోపమేనని జగన్ అన్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ హాజరుకాని ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకోవాలని జగన్ ఆదేశించినట్లు తెలిసింది.
Next Story