రాజధానిపై మరోసారి జగన్
అందరూ బాగుండాలని, అన్ని ప్రాంతాలూ బాగుండాలనే తమ విధానమని, నీళ్లు, నిధులు నియామకాలు అందరికీ అందేలా చూస్తామని వైఎస్ జగన్ చెప్పారు. కేవలం ఒక ప్రాంతానికే పరిమతం [more]
అందరూ బాగుండాలని, అన్ని ప్రాంతాలూ బాగుండాలనే తమ విధానమని, నీళ్లు, నిధులు నియామకాలు అందరికీ అందేలా చూస్తామని వైఎస్ జగన్ చెప్పారు. కేవలం ఒక ప్రాంతానికే పరిమతం [more]

అందరూ బాగుండాలని, అన్ని ప్రాంతాలూ బాగుండాలనే తమ విధానమని, నీళ్లు, నిధులు నియామకాలు అందరికీ అందేలా చూస్తామని వైఎస్ జగన్ చెప్పారు. కేవలం ఒక ప్రాంతానికే పరిమతం చేయబోమని చెప్పారు. గతంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామన్నారు. అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోబోతున్నట్లు జగన్ పరోక్షంగా మూడు రాజధానుల అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. త్వరలోనే దీనిపై నిర్ణయం ఉటుందని చెప్పారు.. ప్రజలందరికీ పాలన సమానంగా అందాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని జగన్ తెలిపారు. ఏలూరులో జరిగిన బహిరంగ సభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆరోగ్య శ్రీ ప్రారంభంతో…..
ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించడం తన జీవితంలో ఎంతో సంతృప్తి నిచ్చిందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఏలూరులో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టును జగన్ ప్రారంభించారు. మొత్తం 2059 వ్యాధులకు ఆరోగ్య శ్రీని వర్తింప చేస్తున్నామని చెప్పారు. కొత్త సంవత్సరంలో తొలి రోజు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేశామని, ఈరోజు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఆరోగ్య శ్రీని తెచ్చామన్నారు. ఆపరేషన్ చేయించుకున్నాక విశ్రాంతి అవసరమని, రోగి విశ్రాంతి సమయంలో నెలకు ఐదువేలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో కోటి 42 లక్షల ఆరోగ్య శ్రీ కార్డులను ఇస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నారన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మందులు కొరత ఉండకుండా చూస్తున్నామన్నారు. మందులు కూడా అంతర్జాతీయ ప్రమాణాల్లో నాణ్యతను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెంచుతున్నామన్నారు. జనవరి 9వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామన్నారు.

