నీటి దోపిడి తెలంగాణాదే… మాది కాదు
నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నీటి పారుదల శాఖను సమీక్ష చేయనున్నారు. అపెక్స్ కమిటీ లో వాదించాల్సిన విషయాలపై చర్చించనున్నారు. ప్రధానంగా పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యం [more]
నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నీటి పారుదల శాఖను సమీక్ష చేయనున్నారు. అపెక్స్ కమిటీ లో వాదించాల్సిన విషయాలపై చర్చించనున్నారు. ప్రధానంగా పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యం [more]

నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నీటి పారుదల శాఖను సమీక్ష చేయనున్నారు. అపెక్స్ కమిటీ లో వాదించాల్సిన విషయాలపై చర్చించనున్నారు. ప్రధానంగా పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపుదలపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న యాగీని జగన్ తప్పుపట్టారు. ఈ మేరకు జగన్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు ఘాటు లేఖ రాశారు. తాను రాసిన లేఖకు ఏపీ నుంచి స్పందన లేదంటూ షెకావత్ చేసిన వ్యాఖ్యలను జగన్ తప్పుపట్టారు. తమకు కేటాయించిన నీటిని ఆధారంగానే ప్రాజెక్టులను చేపట్టినట్లు జగన్ ఆ లేఖలో వివరంచారు. కృష్ణా జలాల ట్రిబ్యునల్ ఆదేశాల మేరకే నడుచుకుంటున్నామని చెప్పారు. తమకు కేటాయించిన నీటిని సమర్ధవంతంగా వినియోగించుకునేందుకే తాము రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టామని జగన్ లేఖలో వివరించారు. ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా కొత్త ప్రాజెక్టులు చేపడుతుంది తెలంగాణ మాత్రమేనని జగన్ తెలపిారు. పాలమూరు రంగారెడ్డి, దిండి ఎత్తపోతల ప్రాజెక్టులకు తాము అభ్యంతరం తెలిపినట్లు గుర్తు చేశారు. అయినా తాము లేవనెత్తిన సమస్యకు పరిష్కారం అపెక్స్ కమిటీ నుంచి లభించలేదని జగన్ తెలిపారు.

