నేడు రెండు జిల్లాల్లో జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. అనంతపురం, కడప జిల్లాల్లో జగన్ పర్యటిస్తారు. ఈరోజు ఉదయం జగన్ ఉదయం పదిగంటలకు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. అనంతపురం, కడప జిల్లాల్లో జగన్ పర్యటిస్తారు. ఈరోజు ఉదయం జగన్ ఉదయం పదిగంటలకు [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. అనంతపురం, కడప జిల్లాల్లో జగన్ పర్యటిస్తారు. ఈరోజు ఉదయం జగన్ ఉదయం పదిగంటలకు పుట్టపర్తి చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాయదుర్గం నియోజకవర్గంలో జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా తన సొంత నియోజకవర్గమైన పులివెందులకు చేరుకుని వివిధ పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. సాయంత్రం ఇడుపుల పాయకు చేరుకుని జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. రేపు కూడా కడప, బద్వేలు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. జగన్ పర్యటన సందర్బంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.