వైసీపీ ఎంపీకి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్
గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ పార్లమెంటు సభ్యుడి తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టింది పేదల [more]
గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ పార్లమెంటు సభ్యుడి తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టింది పేదల [more]

గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ పార్లమెంటు సభ్యుడి తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టింది పేదల పిల్లలకోసమేనని జగన్ అన్నారు. ఇంగ్లీష్ మీడియంకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా పార్టీ పరంగా చర్యలు తప్పవని జగన్ హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి జిల్లాల పార్టీ ఇన్ ఛార్జి వైవీ సుబ్బారెడ్డిని పిలిచి ఎంపీ తీరుపై జగన్ చర్చించినట్లు తెలిసింది. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీ లైన్ కు వ్యతిరేకంగా ఇటీవల మాట్లాడిన సంగతి తెలిసిందే. వివరణ తీసుకుని పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని జగన్ వైవీ సుబ్బారెడ్డిని జగన్ ఆదేశించారు.