Wed Mar 18 2026 21:44:53 GMT+0530 (India Standard Time)
జగన్ తొలి అడుగు
వైఎస్ జగన్ సర్కార్ మద్యనిషేధం అమలులో తొలి అడుగు వేసింది. తాము అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యనిషేధాన్ని అమలు చేస్తామని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. [more]
వైఎస్ జగన్ సర్కార్ మద్యనిషేధం అమలులో తొలి అడుగు వేసింది. తాము అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యనిషేధాన్ని అమలు చేస్తామని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. [more]

వైఎస్ జగన్ సర్కార్ మద్యనిషేధం అమలులో తొలి అడుగు వేసింది. తాము అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యనిషేధాన్ని అమలు చేస్తామని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా బెల్ట్ షాపులపై కొరడా ఝుళిపించిన జగన్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మద్యం షాపుల నిర్వహణ ప్రభుత్వమే చూడాలని నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. తమిళనాడులో లాగా మద్యం దుకాణాలన్నీ ఇక ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించేలా చట్టం తేనుంది.
Next Story