Fri Jan 30 2026 19:27:17 GMT+0000 (Coordinated Universal Time)
యువ సంగీత దర్శకుడి ఆత్మహత్య

యువ మ్యూజిక్ డైరెక్టర్ అనురాగ్ వినీల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాగోల్ మమతానగర్ లోని ఇంట్లో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినీల్ పలు ప్రైవేటు ఆల్బమ్ లకు సంగీతాన్ని అందించారు. ప్రైవేటు అల్బమ్ లలో ఆయన మ్యూజిక్ అందించిన నీలాకాశం, వందేమాతరం, ఓ చెలియా అనే ఆకట్టుకున్నాయి. చిత్రాల్లో అవకాశాల కోసం వినీల్ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. చిత్రాల్లో అవకాశం దొరకక ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు అనుమానిస్తుండగా, వినీల్ కొంతకాలంగా డ్రగ్స్ కి బానిసైనట్లు చుట్టుపక్కల వారు చెబుతున్నారు. పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Next Story

