Tue Mar 24 2026 16:45:06 GMT+0530 (India Standard Time)
యోగి మరో వివాదాస్పద నిర్ణయం

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆయన పలు ప్రాంతాల పేర్లు మార్చి హిందూ పేర్లు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మారుస్తున్నట్లు ప్రకటించారు. తమకు గర్వకారణమైన అయోధ్య పేరును జిల్లాకు పెట్టడం సరైనదన్నారు. ఈ మేరకు అయోధ్యలో జరిగిన దీపావళి వేడుకల్లో ఆయన ప్రకటించారు. దీంతో పాటు త్వరలోనే అయోధ్యలో ఎయిర్ పోర్టు నిర్మించి... రాముడి పేరు, వైద్య కళాశాల ఏర్పాటు చేసి రాముడి తండ్రి దశరధుడి పేరు పెడతామని ఆయన పేర్కొన్నారు.
Next Story

