Mon Dec 15 2025 19:53:04 GMT+0000 (Coordinated Universal Time)
17 మంది ప్రమాణ స్వీకారం
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొద్దిసేపటి క్రితం యడ్యూరప్ప తన మంత్రివర్గాన్ని విస్తరించారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 17 మంది బీజేపీ [more]
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొద్దిసేపటి క్రితం యడ్యూరప్ప తన మంత్రివర్గాన్ని విస్తరించారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 17 మంది బీజేపీ [more]

కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొద్దిసేపటి క్రితం యడ్యూరప్ప తన మంత్రివర్గాన్ని విస్తరించారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 17 మంది బీజేపీ శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీటీ రవి, బసవరాజ్ బొమ్మయ్, కోట శ్రీనివాస్ పూజారి, జేసీ మధుస్వామి, చంద్రకాంత్ గౌడ్, ప్రభు చౌహాన్, శశికళ, జగదీష్ శెట్టర్, కెఎస్ ఈశ్వరప్ప, ఆర్. అశోక్, సురేష్ కుమార్, అశ్వధ్ నారాయణ, గోవింద్ మక్తప్ప, సీఎస్ లక్ష్మణ్, సంగప్ప సవడి, సోమన్న తదితరులు ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 25 రోజుల తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేయడం విశేషం.
Next Story