Tue Mar 24 2026 03:00:25 GMT+0530 (India Standard Time)
బెజవాడ వైసీపీ, టీడీపీ ఫ్లెక్సీల ఫైట్

బెజవాడలో జగన్ పాదయాత్రకు ముందే వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఫ్లెక్సీ విషయంలో గొడవ తలెత్తింది. ఈరోజు వైసీపీలో టీడీపీ నేత యలమంచిలి రవి చేరుతుండటంతో విజయవాడ నగరంలో పెద్దయెత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జగన్ కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చించి వేశారు. దీంతో పోలీసులకు టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ తలెత్తడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

