Thu Mar 19 2026 21:26:58 GMT+0530 (India Standard Time)
వైసీపీకి షాకిచ్చిన సాంబశివరావు

రెండు రోజుల క్రితం విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర శిబిరం వద్దకు వెళ్లి మరీ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిసి మాజీ డీజీపీ సాంబశివరావు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. అమరావతిలో వీరి భేటీ జరిగింది. సాగరమాల ప్రాజెక్టుపై చర్చించేందుకు ముఖ్యమంత్రిని కలిసినట్లు ఆయన ప్రకటించారు. అయితే, తాను మర్యాదపూర్వకంగానే జగన్ ను కలిశానని, కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే వైసీపీ నేతలు తాను పార్టీలో చేరుతున్నట్లుగా చెప్పి ఉండవచ్చని తెలిపారు. ఇప్పట్లో తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు.
Next Story

