Mon Mar 16 2026 03:34:35 GMT+0530 (India Standard Time)
హరీశ్ రావుకు స్వాగతం పలికిన వైసీపీ ఎమ్మెల్యే

టీఆర్ఎస్ ముఖ్యనేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తిరుమలకు వెళ్లారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆయన నిన్న సాయంత్రం తిరుపతి వెళ్లారు. ఆయనకు పలువురు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చంద్రగిరి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా హరీశ్ రావును కలిసి స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ సుధాకర్ యాదవ్, ఈఓతో కలిసి స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ కూడా తిరుమలకు వెళ్లారు. ఆమెకు సైతం చెవిరెడ్డి స్వాగతం పలికారు.

Next Story

