Thu Mar 19 2026 02:39:53 GMT+0530 (India Standard Time)
టీడీపీని ఇరకాటంలోకి నెట్టిన వైసీపీ ఎమ్మెల్యే

పార్టీ ఫిరాయింపులపై తెలుగుదేశం పార్టీని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇరకాటంలో నెట్టారు. తాను టీడీపీలో చేరితే రూ.40 కోట్లు ఇస్తామని ఆ పార్టీ నాయకులు తనతో బేరాలాడారని పూతలపట్టు ఎమ్మెల్యే డా.ఎం.సునీల్ కుమార్ బయటపెట్టారు. ఇందుకు తాను ఒప్పుకోకపోతే తప్పుడుకేసులు పెడతామని బెడిరించారని ఆరోపించారు. ఆయన చిత్తూరులో మాట్లాడతూ... తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేల కొనుగోలుపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని పేర్కొన్నారు. తాను ఎప్పటికీ తన గురువు వైసీపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటే ఉంటానని తేల్చిచెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా బయపడే ప్రసక్తే లేదన్నారు.
Next Story

