Thu Mar 19 2026 21:27:20 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టీఆర్ఎస్ సభ ఏర్పాట్లలో వైసీపీ ఎమ్మెల్యే

హైదరాబాద్ నగర శివార్లలోని కొంగర కలాన్ లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న ప్రగతి నివేదన సభా స్థలికి ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రావడం ఆసక్తికరంగా మారింది. ఆయన మంగళవారం సభా జరిగనున్న ప్రాంగణానికి వచ్చారు. సభ ఏర్పాట్లు పరిశీలిస్తున్న హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ను కలిశారు. అయితే, చెవిరెడ్డికి చెందిన వాహనాలు టీఆర్ఎస్ సభ పనుల కోసం పనిచేస్తున్నందున బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడానికే భాస్కర్ రెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది.
Next Story

