Tue Mar 24 2026 07:31:41 GMT+0530 (India Standard Time)
గృహనిర్భంధంలో వైసీపీ నేతలు

ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని భావించిన వైసీపీ ఈరోజు జాతీయ రహదారుల దిగ్భంధనానికి పిలుపు నిచ్చింది. జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులను కూడా దిగ్భంధించాలని ఆ పార్టీ అధినేత జగన్ పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు ఉదయం నుంచే వైసీపీ నేతలు, కార్యకర్తలు రోడ్లమీదకు వచ్చారు. జాతీయ రహదారులను దిగ్భంధనానికి దిగారు. అయితే పలు చోట్ల వైసీపీ ముఖ్యనేతలను పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచినట్లు సమాచారం అందుతోంది. ఈరోజు జాతీయ రహదారుల దిగ్బంధం, రేపు రైల్ రోకోలకు వైసీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
Next Story

