Tue Mar 24 2026 02:12:07 GMT+0530 (India Standard Time)
బాబుపై హత్యాయత్నం వారే చేయించారా..?

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనపై టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా జగన్ పై దాడి విజయమ్మ, షర్మిలనే చేయించారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. సానుభూతి, అధికారం కోసం జగన్ కటుంబసభ్యులే జగన్ ను హత్య చేసేందుకు ప్రయత్నించారని రాజేంద్రప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. రాజకీయాల్లో ఇంత దిగజారి మాట్లాడటం టీడీపీకే సాధ్యమని వైసీపీ ఎంపీలు పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా రాజేంద్రప్రసాద్ అనర్హుడని పేర్కొన్నారు. చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన దాడిని భువనేశ్వరి, లోకేష్ లే అధికారంలో కోసం చేయించారా అని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు.
Next Story

